Betting Apps Case: సుప్రీత, విష్ణుప్రియ, రీతు చౌదరి సహా 11 మందిపై ‘బెట్టింగ్’ కేసు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సిటీ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. ఈ యూట్యూబర్లు వ్యూస్ ద్వారా వస్తున్న ఆదాయం కంటే మించి ఆదాయం వస్తుండడంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల మీద కేసు నమోదైంది. ఇక పోలీసుల విచారణలో, ఈ యూట్యూబర్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని తప్పుడు ఆశలు రేకెత్తిస్తున్నట్లు తేలింది.
Tollywood: హీరోలు అందరూ ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నారో తెలుసా?
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
ఈ ప్రమోషన్స్ ద్వారా వారు యాప్ నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ కారణంగా చాలా మంది ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు సూసైడ్ కూడా చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులు యూట్యూబర్లకు హెచ్చరికగా నిలుస్తాయని, సమాజంలో బెట్టింగ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!