బిగ్ బాస్ తెలుగు 4 ఫైనలిస్ట్ సోహెల్ కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సోహెల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు నెగటివ్ వచ్చిన కరోనా రిపోర్ట్ ను షేర్ చేస్తూ… “చివరికి నా కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఇది నెగెటివ్” అని పోస్ట్ చేశాడు. ‘నా కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు, స్నేహితులకు, అభిమానులకు థాంక్స్. అయితే నా పుట్టినరోజు వేడుకలను కొంచం గ్రాండ్ గా జరుపుకోలేకపోయాను. అదే కొంచం రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా. కానీ అది కూడా అందరి భద్రత కోసమే’ అంటూ అందరికి థాంక్స్ చెప్పాడు సోహెల్. ఇటీవలే సోహెల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా… బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ అఖిల్ ఆయనకు రిస్ట్ వాచ్ ను బహుమతిగా ఇచ్చాడు. కాగా బిగ్ బాస్-4 కారణంగా సోహెల్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాక కొన్ని షోలలో కన్పించిన సోహెల్ సినిమాలకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.