Hema : బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ తప్పదా..?
- నటి హేమ మెడకు బిగుస్తున్న ఉచ్చు
- ఛార్జ్ షీట్ లో హేమ పేరును చేర్చిన పోలీసులు
- తాను డ్రగ్స్ తీసుకోలేదని హేమ బుకాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది . టాలీవుడ్ కు చెందిన నటి హేమా ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలిసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కానీ తానుగా అక్కడ లేనని హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఈ కేసు దర్యాప్యు చేపట్టిన బెంగుళూరు పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మొత్తం 88 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు.
1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు. టాలీవుడ్ సీనియర్ నటి హేమా ఈ రేవ్ పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ పార్టీలో MDMA డ్రగ్ ను హేమా సేవించినట్టు ఆధారాలను పోలీసులు సేకరించడంతో పాటు, మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. హేమా తో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారు. NDPS సెక్షన్ 27 కింద నటి హేమా ను నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు హేమా తో పాటు హాజరైన మరో యాక్టర్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. తానూ ఏ పాపం ఎరుగను, కొందరు కావలని ఈ కేసులో తనను ఇరికించారని ప్రగల్బాలు పలికిన నటి హేమా, ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేయడంతో గతంలో ఆమె రిలీజ్ చేసిన వీడీయో పోలీసుల నుండి తప్పిచుకునేందుకు ఆడిన నాటకంలో భాగంగా చేసిందేనని తేలిపోయింది. ఈ కేసులో దూకుడుమీదున్న పోలీసులు హేమ అరెస్ట్ కు అన్ని ఆధారాలు సేకరించారని, త్వరలోనే అరెస్ట్ తప్పదని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!