తనకు తాను పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్ మరో నిర్మాత శింగనమల రమేష్ మీద ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే సుమారు 14 ఏళ్ల క్రితం శింగనమల రమేష్ అనే నిర్మాత ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయన 14 ఏళ్ల కోర్టు పోరాటంలో గెలిచారు .ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో శింగనమల రమేష్ మాట్లాడుతూ కొమరం పులి, ఖలేజా సినిమాల వల్ల 100 కోట్లకు పైగా నష్టపోయానని అన్నారు.
Mastan Sai: మస్తాన్ సాయి కేసులో సంచలనాలు.. సినీ పరిశ్రమ వారితో కలిసి డ్రగ్స్ పార్టీలు?
అయితే హీరోల నుంచి ఏమైనా అండదండలు లభించాయా అంటే అదేమీ లేదని హీరోలు కనీసం అయ్యో పాపం కూడా అనలేదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమా చేస్తున్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ కారణంగా సినిమా బాగా లేట్ అయిందని అన్నారు. అయితే తాజాగా ఈ విషయం మీద బండ్ల గణేష్ స్పందిస్తూ శింగనమల రమేష్ గారు, మీరు సరిగా సినిమా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల మీ తప్పు కోసం పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల పాటు ఏ సినిమా చేయకుండా కొన్ని వందల కాల్ షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని, దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి, ఇది కరెక్ట్ కాదు. అంటూ చెప్పుకొచ్చారు.