‘అఖండ 2’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖ చేరుకున్న బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుకు విమానాశ్రయంలో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో అభిమానిపై బాలకృష్ణ ఆవేశంతో ఊగిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అభిమానులను నియంత్రించే క్రమంలో బాలకృష్ణ కొంతమేర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వారిలో ఒక అభిమానిని చూసి వీడెందుకు వచ్చాడు? అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :Hidma Diary: సంచలనంగా మరిన హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టుల అరెస్ట్.. 4 రాష్ట్రాల్లో సోదాలు..
ఈ సంఘటన అనంతరం, బాలకృష్ణ “సాయంత్రం కూడా వీడు కనపడకూడదు”** అంటూ ఆ అభిమానిని అక్కడి నుంచి పంపించి వేయాలని నిర్వాహకులకు హుకుం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సింహాచలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం చేరుకున్న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సింహాద్రి అప్పన్నగా భక్తులు కొలిచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వారు ఆలయ ప్రాంగణంలోని ప్రసిద్ధి చెందిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.
Also Read :I Bomma Ravi : సజ్జనార్ కు రవి తండ్రి రిక్వెస్ట్… మనవరాలి కోసం..
అనంతరం, ఆలయ గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా ఘన విజయం సాధించాలని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిసింది. బాలకృష్ణ నరసింహస్వామి అంటే ఇలవేల్పుగా కొలుచుకుంటారు. అంతేకాక, ఆయనకు తన సినిమాల విడుదలకు ముందు *సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే, ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖ చేరుకున్న వారు ఈ దర్శనం చేసుకున్నారు.