Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ రూమర్‌ను వైరల్ చేశారు.
జూన్ 2న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకకు టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే క్రేజీ టాక్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. కానీ ఈ క్రేజీ కాంబినేషన్ స్టేజ్ పైన సాధ్యమేనా? బాలయ్య రావడానికి ఉన్న బలమైన సమీకరణాలు ఏంటనే దానిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా వేరే హీరోల ఈవెంట్లకు బాలకృష్ణ రావడం చాలా అరుదు. ఒకవేళ ‘పెద్ది’ వేడుకకు ఆయన వస్తే.. అందుకు ఖచ్చితంగా ఈ రెండు కారణాలే ముఖ్యమైనవి అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి బాలయ్యకు, చరణ్‌కు మధ్య బయట ఎంతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంది.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
కేవలం చరణ్ పై ఉన్న ఆప్యాయతతోనే బాలయ్య ఈ ఈవెంట్‌కు వచ్చే అవకాశం ఉంది. లేదా బాలయ్యకు బ్లాక్‌బస్టర్ హిట్ ‘వీరసింహారెడ్డి’ అందించిన లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రాన్ని సమర్పిస్తోంది. అంతేకాకుండా, ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న తన 111వ భారీ చిత్రాన్ని (#NBK111) కూడా ఇదే మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తన సొంత నిర్మాతల కోసం బాలకృష్ణ గెస్ట్‌గా రావడానికి 100% ఛాన్స్ ఉంది. మరి దీని గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!