Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!

Balakrishna

Balakrishna

Balakrishna – Anil Ravipudi: నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణను విభిన్న కోణంలో చూపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఇదే సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్తలు బయటకు రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈసారి అనిల్ రావిపూడి బాలయ్యను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి సినీ ప్రేమికులతో పాటు బాలయ్య అభిమానుల్లో నెలకొంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాల మేళవింపుతో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని టాలీవుడ్‌లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ‘భగవంత్ కేసరి’ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపైకి వస్తే బాక్సాఫీస్ వద్ద మరో భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.