Balayya : బాలకృష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవం..ఎప్పుడంటే..?
- నట సింహా సినీ ప్రయాణానికి 50 ఏళ్లు
- హైదరాబాద్ లో భారీ ఈవెంట్
- హాజరుకానున్న సౌత్ ఇండియా సెలెబ్రిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి రెండవ తరం నటుడిగా 1974లో వచ్చిన తాతమ్మ కల చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికి పుచుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా అంచలంచలుగా ఎదుగుతూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని నందమూరి లెగసిని కొనసాగిస్తున్నారు బాలయ్య. ఈ సినీప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకుని, మరెన్నో శిఖరాలు చేరుకొని నాటి నుండి నేటి వరకు అగ్ర కథానాయకుడిగా సాగుతున్నారు.
కాగా నందమూరి నటసింహ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. తాతమ్మ కల చిత్రం నుండి మొన్న వచ్చిన భగవంత్ కేసరి చిత్రం వరకు బాలయ్య సినీ జీవితం ఓ సాహసం అనే చెప్పాలి. తారక రామారావు కొడుకు హీరోగా వస్తున్నాడు అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా నందమూరి అభిమానులు గర్వించే హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి రికార్డులు తిరగ రాశారు. అప్పటి వరకు పౌరాణికం, పల్లెటూరు నేపథ్యం, కుటుంబ కథ చిత్రాలు ఎక్కువగా వస్తున్న రోజుల్లో ‘సమర సింహ రెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ గతిని మర్చి కొత్త ట్రెండ్ సృష్టించారు బాలయ్య. బైరవద్వీపంలో కురూపి, ఆదిత్య 369 చిత్రంలో కృష్ణదేవరాయులు, అఖండలో అఘోరా వంటి పాత్రల్లో బాలయ్య తప్ప మరెవరు నటించలేరని నిరూపించారు. ఇన్నేళ్ల కెరీర్ లో బాలయ్య నటించని జానర్ లేదంటే అతిశయోక్తి కాదు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
బాలయ్య 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు . రానున్న సెప్టెంబరు 1న కూకట్ పల్లి ఖైతలాపుర్ గ్రౌండ్స్ లో భారీ ఈవెంట్ తలపెట్టారు. శ్రేయాస్ మీడియా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్నీ సౌత్ ఇండియా సెలెబ్రిటీలతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం అటెండ్ అవ్వనున్నారు.
తాజావార్తలు
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!