Bad Girlz: ‘ఇలా చూసుకుంటానే’ అంటున్న ‘బ్యాడ్ గాళ్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే ఈరోజు ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుంచి ‘ఇలా చూసుకుంటానే’ మెలోడీ పాటను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విడుదల చేసారు. పాట విని అద్భుతంగా ఉంది అని కొనియాడారు. అనూప్ రూబెన్స్ సంగీతంలో విడుదల అయినా ‘ఇలా చూసుకుంటానే’ పాటను ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ పాడారు.
Also Read:OG : ఓజీ నుంచి భారీ అప్డేట్.. మూడు రోజుల్లోనే..
Also Read
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ “ఈరోజు మా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రంలో మొదటి పాట ‘ఇలా చూసుకుంటానే’ ను రానా దగ్గుబాటి గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన మెలోడీ పాట. ‘నీలి నీలి ఆకాశం’ పాట సీక్వెల్ గా అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ పాట అంతా జమ్మూ కాశ్మీర్ మరియు మలేషియా ప్రకృతి అందాలలో చిత్రీకరించాము. అనూప్ రూబెన్స్ అద్భుతమైన భాణీ అందిస్తే సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తిగా వినోద భరిత చిత్రం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని తెలిపారు.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?