Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Nakshatra on Irumudi Movie: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మణికంఠ అలియాస్ మణమ్మ పాత్రలో నటించిన చిన్నారి నక్షత్రకు మంచి గుర్తింపు దక్కింది. కేరళకు చెందిన ఈ బాలనటి సోషల్ మీడియా రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. ఇరుముడితో తెలుగు తెరకు పరిచయమైంది. సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో.. నక్షత్ర పేరు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
నక్షత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్స్‌ను చూసిన దర్శకుడు శివ నిర్వాణ ఆమెను సినిమాలో తీసుకోవాలని భావించారట. ముందుగా నక్షత్ర తల్లిని సంప్రదించి.. హైదరాబాద్‌లో ఆడిషన్స్ నిర్వహించారు. ఆ ఆడిషన్స్‌లో నక్షత్ర ఎంపికైంది. అలా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇరుముడిలో కీలకమైన మణమ్మ పాత్రను దక్కించుకుంది. ఇప్పటివరకు నక్షత్ర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు ఆరు సినిమాల్లో నటించింది. మలయాళంతో పాటు కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన సినిమాలోనూ ఆమె కనిపించింది. ఇరుముడిలో నక్షత్ర నటనకు ఫిదా అయిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.. భవిష్యత్తులో ఆమెను లీడ్ యాక్టర్‌గా పరిచయం చేస్తామని ప్రకటించడం విశేషం.
Also Read
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నక్షత్ర తన సినీ ప్రయాణంతో పాటు ఇరుముడి షూటింగ్లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. ‘తెలుగు భాష మొదట్లో నాకు పెద్ద సవాలుగా అనిపించింది. కొన్ని చిన్నచిన్న తెలుగు పదాలు అర్థమైనప్పటికీ.. మాట్లాడటం మాత్రం కష్టంగా ఉండేది. సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ట్రాన్స్‌లేటర్ సహాయంతో తెలుగు డైలాగులను మలయాళంలోకి అనువదించుకుని, వాటిని చదువుతూ సంభాషణలను నేర్చుకున్నా. మొదట్లో పెద్ద పెద్ద డైలాగులు చూసి భయపడ్డా. అయితే సెట్లో దర్శకుడు శివ నిర్వాణతో పాటు యూనిట్ సభ్యులంతా ఇచ్చిన ప్రోత్సాహంతో ధైర్యంగా నటించగలిగా. తెలుగు, మలయాళ భాషల్లో కొన్ని పదాలు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా అమ్మ, నాన్న వంటి పదాలు రెండు భాషల్లోనూ ఒకే విధంగా ఉండటం నాకు సులభంగా అనిపించింది’ అని నక్షత్ర తెలిపింది.
ఇరుముడిలో నాకు బాగా నచ్చిన సన్నివేశం నీటిలో వస్తువులు వేసే సీన్. నీటిలో ఆడుకోవడం నాకు ఇష్టం, అందుకే ఆ సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశా. సినిమాలోని ప్రతి సన్నివేశం నాకు ఇష్టమే. ఇరుముడి చూసినప్పుడు నేను ఎంతో ఏడ్చా. ప్రేక్షకులు కూడా సినిమాను చూసేటప్పుడు టిష్యూలు వెంట తీసుకెళ్లాలని సరదాగా చెప్పారు. నాకు తెలుగు సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదని, నేను ఎక్కువగా మలయాళ సినిమాలనే చూస్తా. అయితే ఇరుముడి షూటింగ్ సమయంలో హీరో రవితేజ నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడేవారు. అంతేకాకుండా కొన్ని తెలుగు పదాలను కూడా నేర్పించారు. అవి నాకు ఎంతో సహాయపడ్డాయి’ అని బేబీ నక్షత్ర చెప్పింది.
‘ప్రస్తుతం నేను ఏడో తరగతి చదువుతున్నా. నా తదుపరి చిత్రం డాడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్‌లు, ఇంటర్వ్యూలకు మా అమ్మతో పాటు మేనమామ కూడా న వెంట వస్తారు. తెలుగు ప్రేక్షకులు నన్ను మణమ్మగా అంగీకరించి.. గుండెల్లో ప్రత్యేకమైన స్థానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నాకు అండగా నిలిచిన సాంకేతిక నిపుణులను మర్చిపోలేదు. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్, డబ్బింగ్ ఇంజనీర్ వేణుకు ప్రత్యేకంగా థ్యాంక్స్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మరింత ఎమోషనల్‌గా మార్చింది’ అని నక్షత్ర చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!