తెలుగు సినిమా దగ్గరే మొదలైన రీ-రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయికి చేరుకుంది. ఈ కోవలోనే మరోసారి తెరపైకి రానున్న భారీ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ఈ ఏడాది తో పది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ప్రత్యేక ట్రీట్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్టుగానే, అక్టోబర్ 31న ‘బాహుబలి – ది ఎపిక్’ పేరుతో సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ‘బాహుబలి: ది బిగినింగ్’ & ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ అనే రెండు భాగాల్ని కలిపి ఒక్క సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read : SANJAY DUTT : సౌత్ సినిమాలపై సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు..
అయితే తాజాగా వినిపిస్తున్న షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సింగిల్ పార్ట్ చిత్రం రన్‌టైం ఏకంగా 5 గంటల 20 నిమిషాలు అని! ఇదే నిజమైతే, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఓ రికార్డు స్థాయి ట్రెండ్ సెట్ చేసే ఘటన అవుతుంది. ప్రస్తుతం ఈ రన్‌టైం విషయమై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉన్నా, అభిమానుల్లో మాత్రం ఈ వార్తతో నూతన ఉత్సాహం నెలకొంది. మొత్తానికి అభిమానులు కోరుకున్నట్లుగానే బాహుబలి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వబోతుండటంతో, ఫ్యాన్స్ మాత్రమే కాక, సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి కనిపిస్తుంది. మరి ఈ రన్‌టైం నిజమేనా..? అన్నది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి..