తెలుగు సినిమా దగ్గరే మొదలైన రీ-రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయికి చేరుకుంది. ఈ కోవలోనే మరోసారి తెరపైకి రానున్న భారీ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ఈ ఏడాది తో పది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ప్రత్యేక ట్రీట్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్టుగానే, అక్టోబర్ 31న ‘బాహుబలి – ది ఎపిక్’ పేరుతో సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే,…