Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Athulya Chandra Arrested: వైద్యం చేయమని పిలిచి, నమ్మించి గదిలోకి రప్పించి.. చిత్రహింసలు పెట్టి అందినకాడికి దోచేసుకున్న దారుణ ఘటనలో తెలుగు చిత్రం ‘మత్తు వదలరా’ నటి అతుల్య చంద్ర పోలీసులకు దొరికిపోయింది. కేరళలోని కొచ్చి నగరంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్, దోపిడీ ఉదంతం సినీ, వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కొచ్చిలోని ఎసెన్ స్ప్రింగ్‌డేల్ అపార్ట్మెంట్లో ఒకరికి బాగా సీరియస్‌గా ఉందని, వెంటనే వైద్యం అందించకపోతే ప్రాణాలకే ప్రమాదమంటూ ఓ యువ డాక్టర్‌కు కబురు వెళ్లింది. సమాచారం ఇచ్చింది నటి అతుల్య చంద్ర, మరో నటుడు, ఓ ప్రొడ్యూసర్ కావడంతో ఆ డాక్టర్ ఏమాత్రం అనుమానించలేదు. పేషెంట్‌ను కాపాడాలన్న ఉద్దేశంతో తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో హుటాహుటిన ఆ ఫ్లాట్‌కు చేరుకున్నాడు.
తీరా లోపలికి అడుగుపెట్టగానే కథ మొత్తం మారిపోయింది. తలుపు వేసి గడియ పెట్టేసిన ఆ ముఠాలో దాదాపు 12 మంది ఉన్నారు. ‘మా బంధువుపై నువ్వు అఘాయిత్యం చేశావ్’ అంటూ అకారణంగా నిందలు వేసి బెదిరింపులకు దిగారు. డాక్టర్‌ను కుర్చీలో బలవంతంగా కూర్చోబెట్టి చెంపలు వాయించేశారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి జరుగుతుండగానే గ్యాంగ్‌లోని ఓ నటుడు డాక్టర్ జేబులోని ఖరీదైన స్మార్ట్‌ఫోన్, చేతికున్న వాచ్, వైర్లెస్ ఇయర్ఫోన్లను లాక్కున్నాడు. “నువ్వు పెద్ద దొంగవిరా.. అరిస్తే చంపేస్తాం” అంటూ భయపెట్టారు. ఆపై అతడిని ఓ చిన్న గదిలోకి తోసి తాళం వేసి తీవ్రంగా హింసించారు. బాధితుడి నుంచి దాదాపు రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను లాక్కున్నారు.
Also Read
- Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
- Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
- The Traitors Telugu: "ది ట్రైటర్స్" తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
వారి కళ్లుగప్పి ఎలాగోలా ఫ్లాట్ నుంచి బయటపడిన ఆ డాక్టర్ నేరుగా కడవంత్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతుల్య చంద్రతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన తొమ్మిది మంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. వైద్యం పేరుతో ట్రాప్ చేసి దోపిడీకి పాల్పడిన ఈ ముఠా వెనుక ఇంకా ఏమైనా పాత వ్యవహారాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
-
Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
-
DGP CV Anand: “పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం”.. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
India’s Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!