Site icon NTV Telugu

Athadu : ‘అతడు’ తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారు!

Athadu Scene

Athadu Scene

‘అతడు’ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో అతడు సినిమా తెర వెనుక కథలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ‘అతడు’ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఇందులో ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారట. మహేష్ బాబు , సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు కూడా. ఈ బిగ్‌ఫ్రీజ్ షాట్ తీయడానికి ఫారిన్ నుంచి ఓ కంపెనీవాళ్లు వచ్చారు. ఏదో సెట్టింగ్ చేస్తున్నారు.

Also Read:War 2 Vs Coolie : నాగార్జునతో ఎన్టీఆర్ కు పోలిక.. ఇదేం ప్రచారం

వాళ్లల్లో వాళ్లకు ఏదో గొడవొచ్చి సడన్‌గా వెళ్లిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైమ్‌లో ఇలా జరిగింది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ పాపం కిందా, మీదా పడి ఓ రిగ్ తయారుచేయించి, దానికి 180 స్టిల్ కెమెరాలు సెట్ చేశాడు. దీంతో ఆ ఫ్రీజింగ్ షాట్ తీయాలి. 500 ఫ్రేమ్స్ పర్ సెకండ్‌లో స్లో-మోషన్ ఎఫెక్ట్ కావాలి. క్యాన్లకి క్యాన్లు నెగిటివ్ కావాల్సిందే. మామూలు 70 ఎం.ఎం. క్యాన్ అయితే 400 ఫీట్లే ఉంటుంది. అదే 16 ఎం.ఎం. క్యాన్‌లో వెయ్యి ఫీట్ల నెగిటివ్ ఉంటుంది. కానీ 16 ఎం.ఎం. నెగిటివ్‌తో షాట్స్ తీసినా మానిటర్‌లో చూడలేరు. ఏదో తంటాలుపడి స్టడీకామ్ కెమేరాకు వాడే చిన్న మానిటర్‌ను తెచ్చి, దీనికి ఫిట్ చేశారు. చాలా నెగిటివ్ ఖర్చయింది కానీ, మొత్తానికి షాట్ సూపర్‌గా వచ్చింది.

Exit mobile version