గతంలో ‘నాటకం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ, హీరో ఆశిష్ గాంధీ, నిర్మాత రిజ్వాన్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. వీరు ముగ్గురూ కలిసి చేసిన తాజా చిత్రం ‘డానీ’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా, సోనాల్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజర్ ఖాన్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ, “మళ్లీ కళ్యాణ్, రిజ్వాన్‌లతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ‘డానీ’ ఒక కల్ట్ వైల్డ్ డ్రామా. సాయి కార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రాకేందు మౌళి పాటలు, ఏకే ఆనంద్ విజువల్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. నవంబర్ 20న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలి” అని కోరారు.
డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ మాట్లాడుతూ, “కెమెరా ముందు ఆశిష్ ఉంటే నాకు ఒకరకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక రిజ్వాన్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇలాంటి రస్టిక్ లవ్ డ్రామాకు ఆయన లాంటి నిర్మాత అయితేనే న్యాయం చేయగలరు. చివరి నిమిషంలో సేజల్ని తీసుకున్నాం, ఆమె అద్భుతంగా నటించింది. మా సినిమా ఆడియో రైట్స్ తీసుకున్న కే మ్యూజిక్కు థాంక్స్” అని తెలిపారు.

