Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరి రికార్డులు తిరగరాస్తోంది. అయితే ఈ భారీ విజయం వెనుక సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ చేసిన ఓ పెద్ద త్యాగం ఉందన్న విషయం రెహమాన్ స్వయంగా వెల్లడించారు. ఈ ఒక్క సినిమా కోసమే తాను ఏకంగా 10 నుంచి 12 సినిమా అవకాశాలను వదులుకున్నానని, గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికగా దర్శకుడు భరత్ బాలా తెరకెక్కించిన ‘బనారస్’ చిత్రం ప్రదర్శన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘రామాయణ’ వంటి మహాకావ్యానికి సంగీతం అందించే క్రమంలో తన సమయాన్ని, శక్తిని పూర్తిగా దానికే అంకితం చేయాల్సి వచ్చిందని, ఈ క్రమంలో ఎంతోమంది అగ్ర దర్శకుల సినిమాలను కూడా కాదనుకోవాల్సి వచ్చిందని, అయినా సరే ఆ నిర్ణయం పట్ల తనకు ఎలాంటి బాధ లేదని, పైగా గర్వంగా ఉందని స్పష్టం చేశారు.
హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్తో కలిసి రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు, ఈ ప్రాజెక్ట్ సంగీత పనుల కోసమే గత మూడేళ్లుగా నిర్విరామంగా శ్రమించినట్లు ఆయన తెలిపారు. సినిమాలోని ప్రతి పాత్రకు తగినట్లుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టిందన్న రెహమాన్ ముఖ్యంగా యష్ పాత్రకు సంబంధించిన ‘రావణ తాండవం’ బీజీఎంను ఫైనల్ చేయడానికి ముందే 12 నుంచి 13 వేర్వేరు వెర్షన్లలో ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. చివరకు అందరికీ నచ్చేలా అద్భుతమైన అవుట్‌పుట్ రావడంతో తన కష్టానికి తగిన ఫలితం దక్కిందన్న రెహమాన్ సినిమాల ఎంపిక విషయంలో తన ఆలోచనా విధానాన్ని కూడా బయటపెట్టారు. ఏదైనా కథపై తనకు నిజమైన ఆసక్తి, లోతైన కనెక్షన్ ఏర్పడితేనే ఆ సినిమాను ఒప్పుకుంటానని, తాను చేసే పని తనలోని కళాకారుడికి సంతృప్తిని ఇవ్వడంతో పాటు, తనతో కలిసి పనిచేసే బృందంలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాలని రెహమాన్ అభిప్రాయపడ్డారు. మూడేళ్ల పాటు మరో ఆలోచన లేకుండా ‘రామాయణ’ కోసం రెహమాన్ పెట్టిన ఈ ఎఫర్ట్ ఇప్పుడు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Also Read
తాజావార్తలు
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు