AR Rahman: ‘అబ్బి అబ్బి..’ సంచలనం.. రెహమాన్ ను నమ్మొచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక పాట హిట్టయితే, ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా? ఈ ప్రశ్న ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఏఆర్ రెహమాన్. కొంతకాలంగా పూర్తిస్థాయి మ్యూజికల్ హిట్ ఆల్బమ్ ఇవ్వడంలో తడబడుతున్న రెహమాన్‌పై, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ద నమ్మకమే ఉంచారు. ఆ నమ్మకం ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్‌కు తెలుగులో ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. ఆయన సంగీతం అందించిన దాదాపు అన్ని తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నెగటివ్ సెంటిమెంట్‌ను పక్కనపెట్టి, బుచ్చిబాబు తన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’కి రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, తన ఎంపిక సరైనదేనని నిరూపించేలా రెహమాన్ ఇటీవల కాలంలో మంచి ఫామ్‌ను కనబరుస్తున్నారు.
Also Read :Keerthy Suresh: ఫైనల్లీ కీర్తికి తెలుగు సినిమా దొరికిందోచ్
Also Read
ఇటీవల తమిళ చిత్రం ‘జీని’ నుండి విడుదలైన ‘అబ్బి అబ్బి..’ పాట సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాట, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా, ఈ పాటలో హీరోయిన్లు కృతిశెట్టి, కల్యాణి ప్రియదర్శన్ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగే బెల్లీ డ్యాన్స్ పోటీ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మరోవైపు కమల్ హాసన్ ‘థగ్స్ లైఫ్’లో ‘జింగుచా..’ పాట హిట్టయినా, మిగతా పాటలు సోసోగానే ఉండటంతో, ఒకే పాట హిట్టయితే పూర్తి ఆల్బమ్‌పై నమ్మకం పెట్టుకోవచ్చా అనే సందేహాలు తలెత్తాయి. అయితే ‘అబ్బి అబ్బి’ పాట భారీ విజయం సాధించడంతో, రెహమాన్ మళ్లీ తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తున్నారని అభిమానులు నమ్ముతున్నారు. ఈ ఒక్క పాటతో దర్శకుడు బుచ్చిబాబు నమ్మకాన్ని రెహమాన్ నిలబెట్టారని చెప్పవచ్చు. ఈ తాజా హిట్‌తో ఇప్పుడు అందరి దృష్టీ ‘పెద్ది’ ఆల్బమ్‌పై పడింది. రెహమాన్ తన పూర్తిస్థాయి ఫామ్‌ను ఈ చిత్రంతో నిరూపించుకుంటారని, మెగా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!