TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడేళ్లుగా అటకెక్కిన ‘నంది అవార్డుల’ పండగను మళ్లీ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఏపీ ఎఫ్డీసీ (AP FDC) చైర్మన్, టీవీ ఇండస్ట్రీ పెద్దల మధ్య జరిగిన తాజా చర్చల్లో కొన్ని సంచలన విషయాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఏపీలో షూటింగ్‌లు జరగాలంటే.. స్టూడియోలకు స్థలాలు ఇవ్వడంతో పాటు, టెలివిజన్ రంగంలో ‘పరభాషా నటుల’ హవాకు చెక్ పెట్టాలన్న డిమాండ్ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ సినీ, టీవీ, నాటక రంగాలకు సంబంధించి 2017 నుంచి నిలిచిపోయిన నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్, సభ్యులు బుర్ర సాయి మాధవ్, మీర్, నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని తదితరులు 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భరత్ భూషణ్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న 2017 – 2024 నంది అవార్డులను ఎలా ఇస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని, 2025 నుంచి మాత్రం ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా అవార్డుల పండగ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక్క రోజులోనే ఈ భారీ ఈవెంట్‌ను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అవార్డుల సంగతి పక్కన పెడితే, టీవీ ఇండస్ట్రీ ప్రతినిధులు పెట్టిన కండిషన్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీలో కూడా సీరియల్స్, టీవీ ప్రోగ్రామ్స్ షూటింగులు భారీగా జరగాలని ఎఫ్డీసీ చైర్మన్ కోరగా.. దానికి టీవీ రంగం వారు గట్టిగానే బదులిచ్చారు. తాము ఏపీకి రావడానికి సిద్ధమేనని, కానీ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు కావాలని డిమాండ్ చేశారు.
Also Read
ముఖ్యంగా.. తెలుగు సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న పరభాషా ఆర్టిస్టుల వినియోగాన్ని పరిమితం (మిత్తం) చేయాలని వారు గట్టిగా కోరారు. అలా చేస్తేనే మన లోకల్ ఆర్టిస్టులకు బతుకుతెరువు ఉంటుందని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా, ఏపీలో షూటింగులు జరగాలంటే.. స్టూడియోల నిర్మాణానికి ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాలని, అలాగే జిల్లాల్లోనూ అకామడేషన్ కోసం జాగాలివ్వాలని కోరారు. నిర్మాతలపై భారం పడకుండా సబ్సిడీలు ఇస్తూనే.. ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత కోసం ఇన్సూరెన్స్, వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు. టీవీ 24 క్రాఫ్ట్స్ ప్రతినిధుల డిమాండ్లపై ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ సానుకూలంగా స్పందించారు. అయితే, స్థలాల కేటాయింపు, సబ్సిడీలు, ఇతర ఆంక్షలు అనేవి రాత్రికి రాత్రే తీసుకునే నిర్ణయాలు కావని.. త్వరలోనే ప్రత్యేక కమిటీలు వేసి, ప్రభుత్వంతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదేమైనా.. ఏడేళ్లుగా నంది అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ, టీవీ, నాటక రంగాలకు ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అదే సమయంలో ఏపీలో షూటింగుల విషయంలో టీవీ పరిశ్రమ పెట్టిన కండిషన్స్ కు ప్రభుత్వం ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
-
Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
-
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!