Chandrababu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కోట శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఇండస్ట్రీకి నటన అంటే ఏంటో చూపించారు. 40 సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు కోట శ్రీనివాస్. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా పనిచేశారు అని గుర్తు చేసుకున్నరు సీఎం చంద్రబాబు.
Read Also : Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్
ఓకే సీనులో అన్ని హావభావాలు కనబరిచే గొప్ప నటుడు కోట శ్రీనివాస్. అరుదైన విలక్షణ నటుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. పద్మశ్రీ అవార్డుతో నంది అవార్డులు అందుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు చంద్రబాబు.
Read Also : Venkaih Naidu : గొప్ప మానవతా వాది.. ‘కోట’కు వెంకయ్య నాయుడు నివాళి