“నిశ్శబ్దం” అనుష్క శెట్టి మరో కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ 2021లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ఏడాది సగం పూర్తయినా వాటి గురించి ఎలాంటి ప్రకటన లేదు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఓ సినిమాలో అనుష్క నటించబోతోందని వార్తలు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి ఇందులో ప్రధాన పాత్రలో కన్పించబోతున్నాడని అన్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అన్నారు. కానీ తెలియని కారణాల వల్ల ఈ చిత్రం కూడా ఆగిపోయిందనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : “రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ?
మరి ఈ మూవీ ఎందుకు ఆగిపోయిందో అని అనుష్క అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరోవైపు బరువు తగ్గడానికి ప్రయత్నించి ఆ పని చేయలేకపోయిన అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఎన్ని ఊహాగానాలు వచ్చినా అనుష్క మాత్రం పెదవి విప్పడం లేదు. మరి అనుష్క తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.