“రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ?

“రాక్షసుడు-2″ను నిన్న పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. “రాక్షసుడు-2″కు సీక్వెల్ గా తెరకెక్కనున్న “రాక్షసుడు 2″కు కూడా రమేష్ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అయితే సినిమాలో నటించబోయే హీరో, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో చిత్రీకరించబడుతుంది. ఇందులో ఓ బిగ్ స్టార్ నటించబోతున్నాడు అంటూ సస్పెన్స్ లో పెట్టేశారు. దీంతో ఈ సినిమాలో నటించే హీరోపై పలు ఊహాగానాలు మొదలైపోయాయి.

Read Also : కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ !

విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి “రాక్షసుడు 2″లో నటించబోయే బిగ్ స్టార్ అని అంటున్నారు. రమేష్ వర్మ వివరించిన స్క్రిప్ట్ విజయ్ సేతుపతికి బాగా నచ్చిందట. కానీ ఆయన ఇంకా ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేయలేదు. విజయ్ సేతుపతి ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న స్టార్లలో ఒకరు. తమిళ, హిందీ భాషలలో ఆయన వరుస సినిమాలు చేయాల్సి ఉంది. డేట్స్ అడ్జస్ట్ మెంట్ ను బట్టి ఈ సినిమాకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజ “ఖిలాడి”తో రూపొందిస్తున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరం చివరిలో తన దృష్టిని “రాక్షసుడు 2” వైపు మళ్లించనున్నాడు. మరోవైపు విజయ్ సేతుపతి చివరిసారిగా “ఉప్పెన”లో కనిపించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-