Anushka Shetty: అనుష్క శెట్టి.. ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ ఏదైనా చెబుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Await Update About Anushka Shetty New Movie: సినిమాలు చేయకపోయినా కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలు, సినిమా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటారు. కానీ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మాత్రం ఇందుకు భిన్నం. ఈ మధ్య కాలంలో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అనుష్క అభిమానులు కొత్త సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అనుష్క చివరిగా నటించిన ‘ఘాటీ’ విడుదలై ఏడాది దాటిపోయినా.. ఆమె నుంచి మరో కొత్త సినిమా ప్రకటన రాలేదు. మరోవైపు మలయాళంలో మూడేళ్ల క్రితం అంగీకరించిన ‘కథనార్’ సినిమా కూడా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఏడు నెలలు దాటుతున్నా.. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై చిత్రబృందం స్పష్టత ఇవ్వలేదు. మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో కథనార్ తెరకెక్కుతోంది. ఇందులో నీల అనే కీలక పాత్రలో అనుష్క కనిపించనుంది. శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 15 భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల కోసం అనుష్క ఫాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
- Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా అయినా కథనార్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చిత్రబృందం నుంచి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్వీటీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అనుష్క కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌గా ‘బాహుబలి 3’ ఉండొచ్చనే ప్రచారం గతంలో జరిగింది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. అనుష్క కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తుందో, కథనార్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ.. త్వరలోనైనా అభిమానులకు ఏదైనా స్వీట్ న్యూస్ చెబుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Anushka Shetty: అనుష్క శెట్టి.. ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ ఏదైనా చెబుతుందా?
-
RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
-
Nvidia CEO Controversy: ‘నేను నా భార్యకు ద్రోహం చేశాను,’.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
ట్రెండింగ్
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..