Anupama Parameswaran: బ్రేకప్‌ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్‌షిప్‌ ఎంతో బాధించిందట!

Anupama Parameswaran

Anupama Parameswaran

Anupama Parameswaran: మలయాళ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక విషయంపై తొలిసారి స్పందించారు. ఇటీవల ఆమె ఎదుర్కొన్న బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన తన రిలేషన్‌షిప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ బంధం భావోద్వేగంగా తనను చాలా ఇబ్బందులకు గురిచేసిందని, నియంత్రణ ధోరణి కూడా ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ఆ రిలేషన్‌షిప్ కారణంగా తన మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నాయన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు తన వృత్తిపరమైన ప్రయాణంపైనా కూడా ఆ ప్రభావం పడిందని ఆమె పేర్కొన్నారు. తాను ఇష్టపడే పనిపై దృష్టి పెట్టడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా అనిపించిందని చెప్పారు.

తన రిలేషన్‌షిప్ కొనసాగుతున్న టైంలో, భవిష్యత్తులో వివాహం చేసుకుంటే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని ఆమె ఆలోచించారట. అదే సమయంలో తనకు ఎదురవుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని, ఆ బంధం నుంచి బయటకు రావడమే సరైన నిర్ణయమని భావించినట్లు తెలిపారు. దీంతో తన జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకుని ఆ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన జీవితంలో కొత్త దశను ప్రారంభించినట్లు అనుపమ చెప్పుకొచ్చారు. గత అనుభవాల నుంచి బయటపడుతూ తనను తాను తిరిగి నిర్మించుకోవడం, మానసిక ప్రశాంతతను పొందడం, కెరీర్‌పై దృష్టి పెట్టడమే తన ప్రాధాన్యతగా మారిందని తెలిపారు. అయితే అనుపమ తన ఎక్స్ లవర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతున్న అనుపమకు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.