Site icon NTV Telugu

Singar Mano : మరో ములుపు తిరిగిన సింగర్ మనో కుమారుల దాడి కేసు.

Untitled Design (1)

Untitled Design (1)

యాంకర్ ప్రముఖ సింగర్ మనో మనో కుమారులు దాడి చేసిన కేసు మరో ములుపు తిరిగింది.. తమ కుమారులు ఇద్దరు ఏ తప్పు చేయలేదని తమ కుమారులు పైనే పదిమందికి పైగా యువకులు రాళ్లతో కర్రలతో దాడులు చేశారని సీసీటీవీ వీడియోలను రిలీజ్ చేశారు మనో భార్య జమీలా. ఈ కేసులో తమను కావాలని కుట్ర పూర్వకంగా ఇరికించాలని చూస్తున్నారని తమ కుమారులు ఇద్దరు ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలని కోరారు. ఐదు రోజుల క్రితం చెన్నై ఆలప్పాక్కంలో మద్యం మత్తులో కృపాకరన్‌తోపాటు మరో16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు మనో కూమారులు. గొడవ ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు.

Also Read : Dhanush : మరో సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఆయనే..

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్‌ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వళసరవాక్కం పోలీసులకు సింగర్‌ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్‌ పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వల్సరవాక్కం పోలీసులు విఘ్నేష్, ధర్మను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మనో ఇద్దరు కుమారులు , మరో స్నేహితుడు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మనో కుటుంబ సభ్యులు రిలీజ్ చేసిన సీసీటీవీ విజువల్స్ సంచలనం గా మారాయి, ఆ వీడియోలో కొంతమంది యువకులు మను కుమారులు ఇద్దరు మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తున్నట్లు చాలా స్పష్టంగా ఉండడంతో అసలు ఈ కేసులో వాస్తవం ఎంటో తెలియని పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version