ఈ మధ్య కాలంలో యువతని ఎంతగానో కదిలించిన సాలిడ్ లవ్ స్టోరీస్ ‘కలర్ ఫోటో’, ‘బేబీ’. ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ‘బేబీ’ మూవీ ప్రజంట్ యువతకు మంచి గుణపాఠం లాంటి స్టోరి అని చెప్పాలి. లేని పోని కోరికలకు పోతు లైఫ్‌ని నాశనం చేసుకుంటున్న అమ్మయిలకు ఈ మూవీ మంచి ఉదాహరణ. ఇక ‘కలర్ ఫోటో’ లో అద్బుతమైనా ప్రేమ అంటే ఎలా ఉంటుందో.. కళ్ళకు కట్టినట్టు చూపించారు అంతే కంటతడి కూడా పెట్టించారు. ఈ మూవీ కూడా యూత్‌ని భాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది.
Also Read : Rashmika : ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని..
తాజాగా ఆ సినిమాకు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ , గ్లిమ్ప్స్‌ను జూన్ 2 న విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆరోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్‌ను కూడా రివీల్ చేస్తారట. ఇక నిర్మాత గా వ్యవహరిస్తున్న ఎస్ కె ఎన్ ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక సాయి రాజేష్ , మణిశర్మ వర్క్ చేస్తుండగా.. మరి ఈ మూవీ నుంచి వచ్చే గ్లింప్స్ ప్రేక్షకులకు ఎలాంటి ఫీల్ కలిగిస్తుందో చూడాలి. రివిల్ చేసిన పోస్టర్ అయితే ఫీల్ గుడ్ గానే ఉంది..