Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anita Chowdary Cyber Fraud: ప్రముఖ టాలీవుడ్ నటి అనితా చౌదరి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. అమెరికా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా.. సైబర్ మోసానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.4.14 లక్షలు కాజేశారు. అనితా చౌదరి తాను మోసపోయినట్లు గుర్తించి.. వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు అనితా చౌదరి ఈ నెల 12న విమాన టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికారు. లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థ ఆమెకు కనిపించింది. వెబ్సైట్లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా.. రాజేశ్ అనే వ్యక్తి లిఫ్ట్ చేసి మాట్లాడాడు. వాషింగ్టన్ డీసీకి వెళ్లి.. తిరిగి వచ్చేందుకు బిజినెస్ క్లాస్ టికెట్ల ధర రూ.4,14,180 అవుతుందని చెప్పాడు. అనితా చౌదరిని మాటల్లో పెట్టి.. టికెట్స్ బుకింగ్ చేయడానికి డెబిట్ కార్డు డీటెయిల్స్ కావాలని అడిగాడు. ఓ ఫారం పంపించి.. అందులో డెబిట్ కార్డు డీటెయిల్స్ ఫిల్ చేయమన్నాడు.
Also Read
- Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
- Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
- IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
- RC17 Heroine: హీరోయిన్ రేసులో ఐదుగురు కుర్ర భామలు.. సుకుమార్ మనసులో ఎవరున్నారు?
నిందితుడు అనితా చౌదరితో ఫోన్లో మాట్లాడుతూ.. మొబైల్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) చెప్పాలని కోరాడు. టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భాగంగానే ఓటీపీలు అడుగుతున్నారని భావించిన అనితా.. ఓటీపీ చెప్పారు. ఆపై క్షణాల్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.14 లక్షలు బదిలీ చేసుకున్నారు. డబ్బు డెబిట్ అయినట్లు అనితకు మెసేజ్ వచ్చినా.. టికెట్ల బుకింగ్ పూర్తయినట్లు ఎలాంటి ధ్రువీకరణ రాకపోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించారు. అనితా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెబ్సైట్ నిజమైనదో కాదో చూసుకోవడం అత్యంత కీలకమని పోలీసులు అంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదని చూచించారు.
తాజావార్తలు
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
Cyber Fraud: టాలీవుడ్ నటికి సైబర్ షాక్.. రూ.4.14 లక్షలు స్వాహా!
-
Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
-
Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
-
Madurai Tanishq Robbery Case: తనిష్క్ దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. TVK–NTK మధ్య పొలిటికల్ వార్..!
ట్రెండింగ్
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!