ప్రజంట్ అని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు అనిరుధ్.. కోలీవుడ్ స్టార్ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలకు భారీ హిట్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. ఇటు పాటలను కొత్త తరహా సౌండ్‌ని అందిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే బడా హీరోలు సైతం తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుథ్‌కే ప్రధాన్య ఇస్తున్నారు. దీంతో బాగానే డిమాండ్ చేస్తున్నారు అనిరుధ్.
Also Read : Renu Desai : చైనా పై రేణు దేశాయ్ హాట్ కామెంట్స్.. ?
తాజా సమాచారం ప్రకారం నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా కోసం అనిరుధ్ కు రూ .15 కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియో రైట్స్ రూ.18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి చూస్తే అనిరుధ్ పైన పెట్టిన పెట్టుబడి చిత్ర బృందానికి అప్పుడే తిరిగి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. థమన్ కూడా ఒక్కో చిత్రానికి రూ.8 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ రూ.10 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ తో వచ్చిన క్రేజ్ తో ఒక్కసారిగా భారీ ధరకు ఆడియో రైట్స్ అమ్ముడు పోతున్నాయి. ఇక గతంలో ఏఆర్ రెహమాన్ ఆడియోకు మంచి డిమాండ్ ఉన్నట్టుగానే ఇప్పుడు అనిరుధ్ సంగీతానికి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. మొత్తానికి అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ తో భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.