ఏదైనా సినిమా పెద్ద హిట్ పడగానే.. అలాంటి జోనర్, కాన్సెప్ట్‌లను కంటిన్యూ చేస్తుంటారు మేకర్స్. నెక్ట్స్ అలాంటి చిత్రాలనే దించేస్తుంటారు. మొన్నటి వరకు యాక్షన్ అండ్ లవ్ స్టోరీలది హవా అయితే.. నిన్నటి వరకు హారర్ మూవీస్ హడావుడి నడిచింది. ప్రజెంట్ సూపర్ హీరో కథలకు డిమాండ్. నెక్ట్స్ ట్రెండ్ మారింది. యానిమెటెడ్ మైథాలజీ చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్నారు మేకర్స్. రామాయణ, మహాభారత గాధలను ఆడియన్స్‌కు విజువల్ వండర్‌గా చూపించబోతున్నారు. ఇలాంటి సినిమాలకు మార్గ నిర్దేశకంగా మారింది కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మహావతార్ నరసింహ.
Also Read:Rithika Nayak : మిరాయ్‌లో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశా.. అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నా!
ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహాను చిన్నా, పెద్దా అని తేడా లేకుండా.. సౌత్, నార్త్ అనే బేరియర్స్ చెరిపేసి బ్లాక్ బస్టర్ చేశారు. ఈ త్రీడీ బొమ్మకు బ్రహ్మారథం పట్టడతో రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లను కలెక్ట్స్ చేసి.. సినిమా తీసిన వాళ్లనే ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ సినిమా ఇచ్చిన బూస్టర్‌తో నెక్ట్స్ మహావతార్ యూనివర్శ్ నుండి మహావతార్ పరుశురామ్‌తో పాటు పలు మూవీస్ లోడింగ్ చేస్తోంది. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో తెలుగులో వాయు పుత్రను తెరకెక్కిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్. కార్తీకేయ చిత్రాలతో ఫ్రూవ్ చేసుకున్న చందు మొండేటి ఈ మైథాలజీ యానిమేటెడ్ ఫిల్మ్స్‌కు దర్శకుడు.
మీరేనా తీసేది.. మేము చేయలేమా ఇలాంటి కథలను అంటూ బాలీవుడ్ కూడా స్టార్ట్ చేసింది. మహాభారత గాధను యానిమేటెడ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తోంది నెట్ ఫ్లిక్స్. కురుక్ష్రేత్ర అనే సిరీస్ సిద్ధం చేసి.. ఎనౌన్స్ చేసింది. మహాభారతంలోని అత్యంత కీలక ఘట్టమైన కురుక్షేత్ర యుద్దాన్ని రెండు పార్టులుగా తీసుకురాబోతుంది. అను సిక్కా ఈ సిరీస్ క్రియేట్ కాగా, ఉజాన్ గంగూలీ దర్శకుడు. అక్టోబర్ 10 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పుడే మొదలైన ఈ ట్రెండ్ ఇంకెంత దూరం వెళుతుందో లెట్స్ వెయిట్..