Rithika Nayak : మిరాయ్‌లో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశా.. అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రితికా నాయక్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు?
-నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడుమిరాయ్ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం.ఫైనల్ గా సినిమా ఆడియన్స్ కి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
-చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్. తనలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. మిరాయ్ లో యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది.
తేజసజ్జాతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-తేజ చాలా ప్రొఫెషనల్. వెరీ స్వీట్. డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్లో చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మనోజ్ గారు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్ ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాలో జగపతిబాబు గారితో కలిసి వర్క్ చేయడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్రీయా గారితో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకోవడం మంచి ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతమైన నటీనటులు ఈ సినిమాలో పనిచేశారు. వాళ్ళ అందరితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ జర్నీ చాలెంజింగ్ గా అనిపించిందా?
-ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.
డైరెక్టర్ కార్తీక్ గారి గురించి?
కార్తీక్ గారు చాలా విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన సెట్ లో చాలా క్లారిటీగా ఉంటారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మా ఇద్దరి బర్త్ డేస్ కి ఒక్క రోజు గ్యాప్. సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్ళు.(నవ్వుతూ)
మ్యూజిక్ గురించి ?
హరి గౌర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పాటలు విజువల్ గా చాలా అద్భుతంగా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నాకు సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ నాకు చాలా ఇష్టమైన సినిమా. యాక్షను రొమాన్స్ నా ఫేవరెట్ జోనర్స్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్ గురించి?
-చాలా పాషన్ ఉన్న నిర్మాతలు. చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా తీశారు.
మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. ఫిదా చూసి ఫిదా అయిపోయా.తనే నా ఇన్స్పిరేషన్.
కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి ?
వరుణ్ తేజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మేకర్స్ తెలియజేస్తారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!