అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది, ఈ నేపథ్యంలో తాజా ఐటీ రైడ్స్ గురించి ప్రస్తావిస్తూ ఒక రిపోర్టర్ బయట ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. ఎక్కువగా పోస్టర్ల మీద వేసిన నెంబర్స్ గురించి ఈ ఐటీ రైడ్స్ అంటూ బయట ప్రచారం జరుగుతోంది.
Venkatesh: హీరోల రెమ్యునరేషన్ పై వెంకటష్ షాకింగ్ కామెంట్స్
మీ నెంబర్స్ ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే అనిల్ రావిపూడి తమ నెంబర్స్ 100% కరెక్ట్ అని చెప్పుకొచ్చారు. జీఎస్టీ లెక్కలన్నీ కలుపుకొని ఇవి చెబుతున్నామని ఎక్కడా కూడా పెంచడం గాని తగ్గించడం కానీ చేయలేదని అన్నారు. ఇలాంటి జానర్ కి ఇంత ఆదరణ లభిస్తోంది అనే విషయం ప్రజలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని అన్నారు. నిజానికి ఈ విషయం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే సినిమా సక్సెస్ అయింది జనాలు చూసేశారు కానీ ఇలా కూడా చేయచ్చు అని చెబితే మరో నాలుగైదు సినిమాలు చేయడానికి మా సినిమా బలం అవుతుంది అని అన్నారు.