Site icon NTV Telugu

Anil Ravipudi : ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి కొత్త ట్రెండ్!

Anilravipudi

Anilravipudi

సినిమా ప్రమోషన్స్‌లో టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్‌ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌లు, ముఖ్యంగా సినిమా సెట్స్‌లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం ఇతర దర్శకులకు ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

Also Read :Samantha Ex Makeup Artist: ఎన్నైనా తిట్టండి కానీ..సమంత ఫాన్స్’కి మేకప్ ఆర్టిస్ట్ వార్నింగ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ సినిమాలో కీలక పాత్రలో నటుడు వెంకటేష్ భాగమవుతున్నారు. వెంకటేష్ సెట్స్‌పైకి రాగానే, చిరంజీవి-వెంకటేష్‌ల కాంబినేషన్ చూపిస్తూ మేకర్స్ వెంటనే ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం చిరు, వెంకీలపై ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెలలోనే ఆ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే, అంతకుముందే ఆ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషనే.

Also Read :Naari Naari Naduma Murari : పెద్ద సినిమాల నడుమ శర్వా సినిమా.. అయ్యే పనేనా?

దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ ప్రమోషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ పాట కోసం హీరో పవన్ కళ్యాణ్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మేకింగ్ రూపంలో విడుదల చేశారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ద్వారా, సినిమా పూర్తవకముందే ప్రేక్షకులను షూటింగ్ సరౌండింగ్స్‌లోకి తీసుకెళ్లి, హైప్‌ను మెయింటైన్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే దారిలో హరీష్ శంకర్ వంటి దర్శకులు కూడా నడుస్తూ, తమ సినిమాలపై అంచనాలు పెంచుకుంటున్నారు.

Exit mobile version