పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘8 వసంతాలు’ ఒక కాన్సెప్ట్ ఆధారిత చిత్రం. ఈ సినిమాలో అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం హృదయాన్ని తడమబోయే సినిమాటిక్ అనుభవాన్ని అందించనుందని ప్రోమోలు సూచిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ‘8 వసంతాలు’ను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. జూన్ 20, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రేమకథ మరో మూడు వారాల్లో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచనుంది.
Also Read:Niharika Konidela: మా సినిమాను గుర్తించినందుకు థాంక్స్!
రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనంతిక సనీల్‌కుమార్ అపురూపంగా కనిపిస్తున్నారు. ఆమె అద్భుతమైన చీరలో సౌమ్యంగా, ఆకర్షణీయంగా ఉన్నారు. ఆమె జుట్టులో గులాబీ పుష్పం ఆమె పాత్ర యొక్క సౌందర్యాన్ని, స్వభావాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది.
వరుస మ్యూజికల్ హిట్స్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
Also Read:Yamudu: ఆసక్తి రేపుతున్న ‘యముడు’ టీజర్..
సంగీతం ఈ సినిమాకు కీలకమైన అంశంగా నిలుస్తుంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతలు నిరంతర అప్‌డేట్స్‌తో దూకుడైన ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ‘8 వసంతాలు’ జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.