Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!

Epic Teaser

Epic Teaser

టాలీవుడ్‌లో వినూత్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న సరికొత్త మూవీ ‘ఎపిక్’. ఆదిత్య హసన్ దర్శకత్వంలో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించి ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకుంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘ఎపిక్’ చిత్రాన్ని జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు ‘ఎపిక్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టడం వెనుకే ఒక పెద్ద సస్పెన్స్ దాగి ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కథాంశం ఎంతో వైవిధ్యంగా ఉండటంతో పాటు, ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్నట్లు టాక్. ఈ చిత్రంలో ఆనంద్ మునుపెన్నడూ కనిపించని ఒక సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారు. జూలై చివరి వారంలో పెద్దగా వేరే భారీ చిత్రాల పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్ పాయింట్ కానుంది. నాగావంశీ నిర్మిస్తున్న ఈ సినిమా #90స్ సిరీస్ కి కొనసాగింపుగా ఉంటుందని, రోహన్ క్యారెక్టర్ పెద్దయ్యాక జరిగే కధగా ఉంటుందని టీం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

×
×
Ad