Shiva Nirvana : ‘అనకాపల్లి’లో అంత మ్యాటర్ ఉందా? స్టేజ్ మీదే సీక్రెట్ లీక్ చేసిన శివ నిర్వాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో టాలీవుడ్లో రూటెడ్, రస్టిక్ స్టోరీలకు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ఇదే కోవలో వస్తున్న మరో పక్కా విలేజ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తూ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టాలీవుడ్ ప్రముఖులు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.
ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు శివ నిర్వాణ ‘అనకాపల్లి’ గురించి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్ చేశారు. అనకాపల్లితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అక్కడే తాను డిగ్రీ చదివానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ అనకాపల్లి రూటెడ్ ఎమోషన్ తో తానూ ఓ కథ రాసి సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకున్నానని ఆయన వెల్లడించారు. “కానీ త్రినాథ్ నాకా అవకాశం ఇవ్వలేదు. నాకంటే ముందే ఆయన ఈ ‘అనకాపల్లి’ చిత్రంతో ప్రయోగం చేసేశారు” అని శివ నిర్వాణ చెప్పడంతో సినిమాలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమా కోర్ పాయింట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనే లైన్ గుర్తుపెట్టుకోండి. ప్రియుడు వయలెంట్ గా మారితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు” అని అన్నారు. మొత్తానికి.. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా సౌండ్ చేయడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘భగీరథ’ సినిమా చూసి స్పూర్తి పొంది ఇవాళ నిర్మాత స్థాయికి ఎదిగిన కాండ్రేగుల నాయుడు ప్రయాణం ఈ వేదికపై అందరికీ స్ఫూర్తినిచ్చింది. దేవ్జండ్ మ్యూజిక్, మాయా వి సినిమాటోగ్రఫీతో రాబోతున్న ఈ కల్ట్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!