JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్ సాలిడ్ గా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక భారీ సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే అయ్యాలా ఉందని తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ – నెల్సన్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కడానికి చాలా ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏకంగా 2028వ సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ‘జైలర్ 2’ చిత్రంతో బిజీగా ఉన్న నెల్సన్.. ఆ తర్వాత కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్‌లతో ఒక రేర్ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. మరోవైపు ఎన్టీఆర్ కూడా తన ముందస్తు కమిట్మెంట్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తయిన వెంటనే, ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చేయబోతున్నాడు. ‘డ్రాగన్’ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే గ్యాప్‌లో.. ఇటు నెల్సన్ కూడా రజనీ – కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు భారీ చిత్రాలు పూర్తవడానికి కనీసం రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. ఈ సమీకరణాల వల్లే ఎన్టీఆర్ – నెల్సన్ కాంబో 2028లోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
-
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!