తమిళనాడులో లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగింపు

కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. క‌రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, ఈసారి మరిన్ని సడలింపులు కల్పించింది.. షాపులను రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ తెరిచిఉంచేందుకు అనుమతిచ్చిన సర్కార్‌.. రెస్టారెంట్లను 50 శాతం సీటింగ్ సామ‌ర్ధ్యంతో తెరుచుకోవచ్చని పేర్కొంది.. ఇక, పుదుచ్చేరికి బస్సు స‌ర్వీసుల‌ను పున‌రుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, తమిళనాడులో తాజాగా 3039 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంట‌ల్లో మరో 69 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌ కేసులు 25.13 ల‌క్షల‌కు చేరుకోగా.. 33,322 మంది మృతిచెందారు.. మరోవైపు పెళ్లిళ్లకు 50మంది, అంత్యక్రియలకు 20 మంది మించరాదని స్పష్టం చేసిన తమిళనాడు ప్రభుత్వం.. స్కూళ్లు, కాలేజీలు, బార్‌లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, పార్క్‌లు మూసే ఉంటాయని పేర్కొంది. సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-