Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Majithia: దుబాయ్‌లో గ్లామర్, క్రికెట్, అండర్‌వరల్డ్ బెట్టింగ్ దందాల మధ్య ఉన్న అదృశ్య సంబంధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమిత్ మజేతియా.. ఇజాజ్ ఖాన్ పాడ్‌కాస్ట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్టార్ క్రికెటర్ల విలాసాలు, బురఖాల్లో వచ్చే బాలీవుడ్ భామల రహస్యాలు, ఆన్లైన్ బెట్టింగ్ పుట్టుపూర్వోత్తరాలపై ఆయన ఈ పాడ్‌కాస్ట్‌లో బాంబు పేల్చారు.
బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలు, వారికి ఖరీదైన బహుమతులు ఇస్తారనే ప్రచారంపై స్పందిస్తూ అమిత్ సంచలన విషయాలు బయటపెట్టారు. “నేను ఎవరికీ ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వలేదు. కానీ ఇండస్ట్రీతో బలమైన పరిచయాలు ఉన్నాయి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలిచిన వారితో సహా పలువురు స్టార్ హీరోయిన్లు నా స్థావరంలో ఎవరి కంటా పడకుండా బురఖాలు ధరించి కూర్చునేవారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో జనాలకు స్పష్టంగా తెలుసు” అంటూ పేర్లు చెప్పకుండానే ఇండస్ట్రీని షేక్ చేసే హింట్ ఇచ్చారు. వీకెండ్ పార్టీలు, టూరిజం బిజినెస్ నేపథ్యంలో సెలబ్రిటీలు తన కార్లను విరివిగా వాడుకునేవారని పేర్కొన్నారు.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ క్రికెటర్ల ప్రైవేట్ వ్యవహారాలను బట్టబయలు చేశారు. “నేను ఎప్పుడూ నేరుగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు, ఏ ఆటగాడినీ ఆ పని కోసం సంప్రదించలేదు. అది నా పాలసీకి విరుద్ధం. అంతమాత్రాన నేను చేయలేనని కాదు.. అనుకుంటే చాలా ఈజీగా చేయగలను. ఎంతో మంది టాప్ క్రికెటర్లు నాకు మంచి ఫ్రెండ్స్. నా క్లబ్‌కు వచ్చి హుక్కా తాగడం, ముజ్రా డ్యాన్సులు చూడటం వాళ్లకు అలవాటు. అయితే వారు వచ్చినప్పుడు ‘రెండు గంటల పాటు క్లబ్‌ను మూసేసి బయటివారిని ఎవరినీ రానివ్వొద్దు’ అని పట్టుబట్టేవారు. కేవలం వారి కోసం నా రెగ్యులర్ కస్టమర్లను వదులుకోవడం ఇష్టం లేక వారి డిమాండ్లకు నో చెప్పేవాడిని” అని వివరించారు.
తన ప్రస్థానం గురించి చెప్తూ.. “భారత్‌లో పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జరిగిన మరుసటి రోజే నేను దుబాయ్‌కి చేరుకున్నాను. ఆ రోజుల్లో దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ అనే మాటే పుట్టలేదు.. అసలు ఆ వ్యవస్థను సృష్టించిందే నేను. ఆ కాలంలో నేను విశ్లేషకుడిని కాదు, పక్కా బెట్టింగ్ టిప్పర్ని” అని కుండబద్దలు కొట్టారు. దుబాయ్ క్లబ్‌ల జీవనశైలిని వివరిస్తూ.. ఫిల్మ్‌ఫేర్ ఓనర్ రిజ్వాన్ సజన్, సన్నీ లియోన్ దంపతులు తన క్లబ్‌కు వచ్చిన నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. “పోర్న్ స్టార్‌గా కెరీర్ స్టార్ట్ మహిళతో నేను కూర్చున్నప్పుడు.. మా క్లబ్‌లోని బార్ డాన్సర్లు పోర్న్ స్టార్ల కంటే ఎంతో మెరుగైనవారు, అలాంటిది వారితో కలిసి మనం ఎందుకు భోజనం చేయకూడదు అనిపించింది” అన్నారు. అంతేకాకుండా పంజాబీ చిత్రసీమకు చెందిన అగ్ర హీరోలు, హీరోయిన్లు, బడా రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు తన క్లబ్‌కు వచ్చి విలాసంగా నృత్యాలు చూసి, కనీసం బిల్లు కూడా కట్టకుండా వెళ్లిపోయేవారని అమిత్ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?