శివ కార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అమరన్ అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమాతో నటుడు శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్ల గ్రాస్ రాబట్టి దూసుకువెళ్తుతుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. అమరన్ ను డిసెంబరు 5న తెలుగు, తమిల్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషలలోను స్ట్రీమింగ్ కు తీసుకువవస్తుంది నెట్ ఫ్లిక్స్. దీపావళి కానుకగా వచ్చిన అమరన్ థియేట్రికల్ విండో 35 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది. ఓటీటీ రిలీజ్ అయిన కూడా అటు తమిళ్, కేరళలో ఈ సినిమా యాభై రోజుల లాంగ్ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.