Amala : నా కోడళ్ల వల్ల లైఫ్ మారిపోయింది.. అమల కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అందాల నటి, సీనియర్ యాక్ట్రెస్ అమల అక్కినేని ప్రస్తుతం సినిమాల కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన ఆమె, అప్పటి నుంచి కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా పబ్లిక్ లైఫ్‌లో చురుకుగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల అక్కినేని, తన కోడళ్లైన శోభిత ధూళిపాల (నాగ చైతన్య భార్య), జైనబ్ (అఖిల్ అక్కినేని భార్య) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
Also Read : Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
అమల మాట్లాడుతూ.. “నాకు అద్భుతమైన కోడలు ఉన్నారు. వాళ్లు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు. వాళ్ల వల్ల నా జీవితం కొత్తగా మారిపోయింది. మా ఇంట్లో ఇప్పుడు నాకు ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది. అలాగే వారు ఇద్దరూ తమ కెరీర్‌ల్లో చాలా బిజీగా ఉంటారు, ఇది నిజంగా మంచి విషయం. యువత ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండటం చాలా అవసరం. వాళ్లు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లోనే బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి సరదాగా గడుపుతాం. నేను డిమాండ్ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు” అంటూ నవ్వుతూ చెప్పారు. అలాగే నాగ చైతన్య, అఖిల్ గురించి మాట్లాడుతూ.. “వాళ్ళు ఇద్దరూ మంచి ఆలోచనతో ఎదిగారు. నాగార్జున గారికి వాళ్లపై అపారమైన ప్రేమ ఉంటుంది. నేను నా బాధ్యతల పట్ల చాలా కచ్చితంగా ఉంటాను. పిల్లల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండను. నా కుటుంభం పిల్లలు తర్వాతే వేరే ఏదైనా. ఇప్పటికైతే నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది” అంటూ చెప్పుకొచ్చింది అమల. మొదటి సారిగా తన కోడలపై స్పందించడంతో ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు