Pushpa 2: ఇండియన్ సినీ రికార్డులను తిరగరాసిన పుష్ప-2 ది రూల్
- ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం
- రూ.1831 కోట్ల వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసిన పుష్ప-2 ది రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబరు 4న ప్రీమియర్స్ షోస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌పై మొదలైన ‘పుష్ప-2’ ది రూల్ వసూళ్ల రికార్డుల పరంపర సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్చేసింది. కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్ల రూపాయాలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో తన పేరు మీద తిరగరాసుకుంది. రూ. 1810 కోట్ల రూపాయాలు వసూలు చేసిన బాహుబలి-2 వసూళ్లను క్రాస్ చేసి పుష్ప-2 కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల కలయికలో పుష్ప-2 ది రూల్ సినిమాను అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది.
Allu Arjun: పరామర్శకు అల్లు అర్జున్ వెళ్లొచ్చు.. కానీ?
Also Read
- Vishwanath & Sons: 'విశ్వనాథ్ & సన్స్'లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
- Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
- Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
- Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే 32 రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్ఠించింది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డు పుష్ప-2 సాధించి రికార్డుల సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నె తెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్‌వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్నాడు.
తాజావార్తలు
-
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
-
Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
-
Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
-
Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్‌పై ఒత్తిడి పెంచే ప్లాన్..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!