సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్ళడానికి అల్లు అర్జున్‌కి షరతులతో అనుమతిచ్చారు పోలీసులు. ఈమేరకు తాజాగా రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్ కి నోటీసులు ఇచ్చారు. పరామర్శించేందుకు వెళ్లే విషయాన్ని అల్లు అర్జున్ రహస్యంగా ఉంచాలని పోలీసులు నోటీసులతో పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం గంటలోపే ముగించాలని సూచించిన పోలీసులు, ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు, కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
Dil Raju: పవన్ కి పాదాభివందనం చేయాలనిపించింది!
కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తాడని తెలిసి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాము కానీ చివరి నిమిషంలో అల్లు అర్జున్ మేనేజర్ ద్వారా కిమ్స్ హాస్పిటల్ కి రావట్లేదని మాకు సమాచారం వచ్చిందని నోటీసులతో పేర్కొన్నారు. ఇక కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందతున్న శ్రీ తేజను పరామర్శించేందుకు మీరు ఎప్పుడు వచ్చినా ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటామని అల్లు అర్జున్ కి తెలిపిన పోలీసులు గంట ముందు సమాచారం ఇస్తే చాలు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. కిమ్స్ హాస్పిటల్ కి వచ్చే విషయాన్ని రహస్యంగా ఉంచాలని, ఎందుకంటే కిమ్స్ హాస్పిటల్ లో ఉన్న ఇతర పేషంట్లకి, వాళ్ళ అటెండెంట్స్ కి ఇబ్బంది కలగకుండా ఉంటుందని అన్నారు. ముందు సమాచారం ఇస్తే కనుక కిమ్స్ హాస్పిటల్ కి వచ్చి తిరిగి వెళ్లేంతవరకు కూడా అవసరమైన ఎస్కార్ట్ ని ఏర్పాటు చేస్తామని అన్నారు.