అరెస్ట్ అయిన కేసులో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది హైదరాబాద్ నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ని పదకొండవ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తర్వాత గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షల కోసం తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. సుమారు రెండు గంటల పాటు నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ వాదోపవాదాల అనంతరం అల్లు అర్జున్ కి 14 రోజులపాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అంటే ఈ నెల 27వ తేదీ వరకు అల్లు అర్జున్ రిమాండ్ లో ఉండాల్సి ఉంటుంది.
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో ట్విస్ట్.. కేసు విత్ డ్రా?
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నిజానికి మరొకపక్క పిటిషన్ కూడా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చడం కరెక్ట్ కాదంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. అల్లు అర్జున్ ఈ నేపథ్యంలో ఆయనను జైలుకు తరలిస్తారా లేక క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చేవరకు ఆగుతారా అనే సందిగ్ధత ఇప్పటివరకు నెలకొంది. కానీ పోలీసులు చంచల్ గూడా జైలుకు అల్లు అర్జున్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అభిమానులు అడ్డుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయిన పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.