Allu Arjun : ‘పుష్ప-2’ నా విక్టరీ కాదు.. ఇండియా విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది.
Also Read : SDT 18 : సాయి దుర్గాతేజ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది
Also Read
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ” నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు నా థాంక్స్. భారతీయులందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. గ్లోబల్‌గా ఉన్న సినీ ప్రేమికులందరూ ఇండియా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి నా ప్రత్యే క ధన్యవాదాలు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ. ఒక సినిమాను అన్ని రాష్ట్రాల ప్రజలు సెలబ్రేట్ చేశాయి. ఇదనే నా దేశం గొప్పతనం. ఇక ఈ సినిమాను ఆదరిస్తున్న అన్నిరాష్ట్రాల సినీ పరిశ్రమలకు, అక్కడి సినీ ప్రముఖులకు, ప్రభుత్వాలకు, పోలీసులకు, మీడియా వాళ్లకు నా థాంక్స్. ముఖ్యంగా పుష్ప-2 సినిమాను మరింత ప్రేమతో, అత్యధిక వసూళ్లతో ఆదరిస్తున్న హిందీ సినీ ప్రేక్షకులకు నా మనస్పూర్తిగా థాంక్స్, ఇక ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌దే. ఆయన విజన్, ఆయన కష్టానికి ప్రతిఫలం ఈ చిత్రం. ఇక ఈ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేయడం ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. అయితే ఈ నెంబర్స్ టెంపరరీ. ఎందుకంటే భవిష్యత్‌లో మరో సూపర్‌హిట్ సినిమా ఈ నెంబర్స్‌ను క్రాస్ చేస్తుంది. కానీ ఆడియన్స్ ఇచ్చే లవ్ మాత్రం శాశ్వతం. వాళ్లు నా పై చూపిస్తున్న వైల్డ్ ప్రేమకు జీవితాంతం బుణపడి ఉంటాను’ అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!