Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో హీరోల అభిమాన సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాయి. ఈ క్రమంలోనే తమ అసోసియేషన్‌లో కీలక సభ్యుడిగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన కరంపూరి సతీష్ కుటుంబం ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు AAFA దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన అసోసియేషన్ కేంద్ర కమిటీ, పాప ప్రాణాలను కాపాడుకునేందుకు అవసరమైన అత్యవసర వైద్య ఖర్చులను అందించి రియల్ హీరోలనిపించుకున్నారు.
కరంపూరి సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచే ఒక అరుదైన, తీవ్రమైన జన్యుపరమైన “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ వ్యాధి నయం చేయడం కోసం వైద్యులు ఇప్పటికే చిన్నారికి రెండు శస్త్రచికిత్సలు (Surgeries) విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, పాప పూర్తిగా కోలుకోవడానికి త్వరలోనే మూడో సర్జరీ కూడా చేయాల్సి ఉంటుందని, అందుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఒకవైపు ఇప్పటికే జరిగిన ఆపరేషన్ల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సతీష్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కేంద్ర కార్యాలయం వెంటనే రంగంలోకి దిగింది. చిన్నారి నక్షిత మూడో సర్జరీ, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1,50,000 (లక్షా యాభై వేల రూపాయలు) నగదును ఆర్థిక సహాయంగా ఆ కుటుంబానికి అందజేసింది.
Also Read
ఈ సందర్భంగా AAFA కేంద్ర ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘మా అసోసియేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మా కుటుంబ సభ్యుడితో సమానం. మా కుటుంబంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, ఏ రకమైన ఆరోగ్య సమస్య ఎదురైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ మొదటి వరుసలో నిలబడి అండగా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. సతీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను, అలాగే తమ అభిమానులను ఎల్లప్పుడూ సేవా మార్గంలో నడిపిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు.. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో అభినందిస్తున్నారు. చిన్నారి నక్షిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్‌కు AAFA ఆర్థిక సహాయం అందించింది.
సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచి “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇప్పటికే ఆమెకు రెండు శస్త్రచికిత్సలు… pic.twitter.com/LkuNoIYksd
— NTV Breaking News (@NTVJustIn) May 27, 2026
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!