Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun-Boyapati Movie On hold: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ‘సరైనోడు’ తర్వాత అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ కొంతకాలంగా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో బన్నీ, బోయపాటి కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్లో ప్రస్తుతం ఎలాంటి సినిమా లేదని తెలుస్తోంది. బోయపాటి ఫోకస్ మరోసారి నందమూరి బాలకృష్ణపైనే ఉందట. బాలయ్యతో ‘అఖండ-3’ తెరకెక్కించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ‘అఖండ’ సినిమా భారీ విజయం సాధించడంతో.. ఈ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం బాలకృష్ణ ‘దాదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయనునున్నారు. ఆ ప్రాజెక్ట్ అనంతరం బోయపాటి చిత్రం చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అట్లీతో సినిమా, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ కారణంగా ఆయన డైరీ ఇప్పటికే బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో బన్నీ-బోయపాటి కాంబినేషన్‌పై వస్తున్న వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!