అల్లు అర్జున్ హీరోగా, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పందం అయినట్టు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీని గురించి అల్లు వారి కాంపౌండ్ నుంచి గానీ, మలయాళ సినీ వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఇప్పటికే ఒక సినిమాను ఖరారు చేశాడని, దాని గురించి విన్నప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పాడు.
Also Read : Flight Crash: విమానంలో లోపాన్ని ముందే గుర్తించిన యువకుడు.. సంచలన విషయాలు వెల్లడి..!
అయితే, అది ఏ సినిమా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. కానీ, బాసిల్ జోసెఫ్ సినిమా ఖరారైనట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో ఆయన శక్తిమాన్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు. 90ల పిల్లలకు శక్తిమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే శక్తిమాన్‌గా అల్లు అర్జున్ నటిస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారుతోంది. నిజానికి, ఈ సినిమాను ముందుగా రణవీర్ సింగ్ హీరోగా చేయాల్సి ఉండగా, ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ సంస్థ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతోంది.
