ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ పై కేవలం అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు వినికిడి. ఇక ఈ మూవీ మూవీకి ‘ఐకాన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ, ఏవో కారణాల పట్టాలెక్కలేదు. అయితే ఐకాన్ టైటిల్ ఎంతగానో నచ్చిన బన్నీ.. ఆ టైటిల్‌ను అట్లీ ప్రాజెక్ట్‌కి సూచించినట్లు వినికిడి. ఇక పోతే..
Also Read : Re-Release : మరో లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..రీ రిలీజ్
ఈ మూవీ గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గురించి చాలా రూమర్స్ వినపడినప్పటికి దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తున్నట్లు షాకింగ్ వీడియో రివీల్ చేశారు . హీరోయిన్ ఎంట్రీనే ఇంత గ్రాండియర్‌గా ప్లాన్ చేసాడంటే ఇక హీరో ఎలివేషన్స్‌కు గూస్బంప్స్ గ్యారెంటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ సినిమాలో బన్నీ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నారని.. ముఖ్యంగా బన్నీ రెండో పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా బలంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా బన్నీ రెండో పాత్ర లుక్‌ను కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడట.