Allu Arjun : పుష్ప -2 తర్వాత బన్నీసినిమా ఆ దర్శకుడితోనే..
- అల్లు అర్జున్ - సుక్కుల పాన్ ఇండియా సినిమా పుష్ప - 2
- డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- తదుపరి సినిమా వర్క్ మొదలెట్టిన బన్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప – 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్పకి కొనసాగింపుగా పుష్ప – 2 రానుంది. రష్మిక మందాన అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా మొదటగా ఈ సినిమా ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలు వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 6న గ్రాండ్ గా విడుదల కానుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Also Read : Koratala Siva : దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించే హీరో ఇతనే..?
Also Read
- Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
ఇదిలా ఉండగా పుష్ప తర్వాత బన్నీ ఏ సినిమా చేయనున్నాడు అనేది అందరీ మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు అట్లీ, వెట్రిమారన్ పేర్లు వినిపించాయి. అట్లీతో సినిమా దాదాపు ఒకే అయిందని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో బన్నీతదుపరి చిత్రంపై బన్నీ యూనిట్ వర్గాలనుండి ఓ సమాచారం అందుతోంది. పుష్ప – 2 పూర్తి చేసిన తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే పని చేయనున్నట్లు తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, అత్యంత భారీ బడ్జెట్ పై ఈ చిత్రం రానుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో ఈ చిత్రాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ గానే నిలిచాయి. మరి ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!