Alias Rukmini: ‘వృషకర్మ’తో నాని టీమ్ పోటీ.. డిసెంబర్ 4 రిలీజ్ వెనుక అసలు రహస్యమిదే!

Vrushakarma Release Update

Vrushakarma Release Update

డిసెంబర్ 4న నాగచైతన్య నటిస్తున్న భారీ చిత్రం ‘వృషకర్మ’తో పాటు ఒక బాలీవుడ్ సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. ఇంతటి భారీ పోటీ మధ్య నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేస్తుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బాక్సాఫీస్ క్లాష్‌పై తాజాగా చిత్ర నిర్మాత దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 4 అనేది తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో కలిసొచ్చిన తేదీ అని, గతంలోనూ ఆ రోజున పలు సినిమాలు ఒకేసారి విడుదలై ఘనవిజయం సాధించాయని ఆమె గుర్తుచేశారు. “‘వృషకర్మ’ జానర్ వేరు, మా ‘అలియాస్ రుక్మిణి’ జానర్ పూర్తిగా వేరు. డిసెంబర్ నెల ప్రారంభం కాబట్టి ప్రేక్షకులు హాలిడే మూడ్‌లో ఉంటారు. రెండు మంచి సినిమాలు ఒకేసారి వస్తే, రెండింటినీ ఆదరించేంత స్టామినా తెలుగు బాక్సాఫీస్‌కు ఉంది” అంటూ పోటీపై తమకున్న పూర్తి ధీమాను వ్యక్తం చేశారు.

ఇక ఈ చిత్రం వివరాల్లోకి వెళ్తే.. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మించారు. ఇందులో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ కథానాయికగా నటించగా, సాయి కుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాంకేతిక విభాగంలో విజయ్ బుల్గానిన్ సంగీతం, జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘అలియాస్ రుక్మిణి’, భారీ పోటీ మధ్య డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి!