Priyadarshan: హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రితో అక్షయ్ కుమార్ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyadarshan: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు 2026 సంవత్సరం సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఆయన నటించిన బ్యాక్-టు-బ్యాక్ కామెడీ చిత్రాలు ‘భూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘భూత్ బంగ్లా’ చిత్రంతో అక్షయ్ కుమార్ – సౌత్ స్టార్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తండ్రి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్‌ల క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ రిపీట్ చేసింది. ఈ విజయాల జోష్‌లోనే ఈ ఐకానిక్ జోడీ తమ 9వ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
తాజా సమాచారం ప్రకారం.. అక్షయ్ – ప్రియదర్శన్ కలయికలో రాబోయే ఈ 9వ చిత్రానికి ‘వికెడ్ సన్నీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ వెనుక ఒక ఆసక్తికరమైన కనెక్షన్ ఉందని చెబుతున్నారు. 22 ఏళ్ల క్రితం (2004లో) వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘ముఝ్సే షాదీ కరోగీ’ చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్ర పేరు ‘సన్నీ’. ఆ సినిమాలో ఆయన స్క్రీన్‌పైకి వచ్చినప్పుడల్లా వచ్చే ‘వికెడ్ సన్నీ’ బీజీఎం నేటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది. ఆ వింటేజ్ క్రేజ్, నాస్టాల్జియాను క్యాష్ చేసుకునేందుకే మేకర్స్ ఈ టైటిల్‌ను లాక్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో అక్షయ్ గత కామెడీ పాత్రలకు పూర్తి భిన్నంగా, సరికొత్త కామెడీతో అలరించనున్నారని సమాచారం.
Also Read
- ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
- Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
- Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్‌గా బాలీవుడ్ హీరో ఫిక్స్
- Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్‌కు వస్తానంటున్న నట'సింహం'
అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబోలో ఇప్పటివరకు 7 చిత్రాలు రిలీజ్ కాగా.. అందులో ‘ఖట్టా మీఠా’ మినహా మిగిలినవన్నీ భారీ విజయాలు సాధించాయి. కాగా, వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న 8వ చిత్రం ‘హైవాన్’. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఒకప్పటి హిట్ జోడీ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రియదర్శన్ హిట్ చిత్రం ‘ఒప్పం’కు రీమేక్‌గా వస్తున్న ఈ సస్పెన్స్-సైకలాజికల్ థ్రిల్లర్‌లో సైఫ్ అలీ ఖాన్ గుడ్డివాడుగా నటిస్తుండగా, అక్షయ్ కుమార్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్ఫుల్ సైకో విలన్ రూల్‌లో కనిపించబోతున్నారు. ఇలా ఒకవైపు థ్రిల్లర్ ‘హైవాన్’, మరోవైపు క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ ‘వికెడ్ సన్నీ’ చిత్రాలతో అక్షయ్ కుమార్ – ప్రియదర్శన్ జోడీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులపై కన్నేసింది.
తాజావార్తలు
-
Vivo Y31T 5G: 7200mAh బ్యాటరీతో Vivo Y31T 5G.. 120Hz స్క్రీన్, 50MP కెమెరా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే
-
ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
-
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
-
Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్‌గా బాలీవుడ్ హీరో ఫిక్స్
-
TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!